శాంతి కిరణాలు (అల్-ఫలాక్)

కమ్యూనిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ®
[విద్యా వ్యాపక ధర్మ సంస్థ]శాంతి కిరణాలు (అల్-ఫలాక్) కమ్యూనిటీ వెల్ఫేర్ ట్రస్ట్న, విద్యా వ్యాపకధర్మ సంస్థ. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా, ఈ సంస్థయొక్క స్థాపకులు మరియు అధ్యక్షులు. ఈ సంస్థ జులై 2 002లో సథాపించబడింది. ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం, ఇస్లాంను దాని నిజరూపంలో ప్రదర్శించి, ప్రజలలో దివ్యఖుర్ఆన్ మరియు ఇస్లాం పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించటానికి ప్రయత్నించడం.లక్ష్యం మరియు ఉద్దేశాలు:


 • ఆదరణీయులైన ప్రవక్తల, సందేశహరుల అందరి పై మరియు చివరి సందేశహరుడైన ముహమ్మద్ పై శాంతి మరియు శుభాలు వర్షించుగాక! మహా ప్రవక్త (’స’అస) అన్నారు:
 • ((’ఖైరుకుమ్ మన్ త’అల్లమ అల్-ఖుర్ఆన వ ’అల్లమహ్))
  “మీలో ఖుర్ఆన్ ను నేర్చుకొని, దానిని (ఇతరులకు) నేర్పేవారు, ఉత్తములు.”

 • శాంతి కిరణాలు (అల్-ఫలాక్) కమ్యూనిటీ ట్రస్ట్ ఒక విద్యా వ్యాపక ధర్మ సంస్థ దీని ముఖ్య లక్ష్యం, వీలైనంతవరకు, దివ్య ఖుర్ఆన్ యొక్క అనువాదాలను ప్రజలలో పంచి, అల్లాహ్ (సు.తా) యొక్క అంతిమ సందేశాన్ని ప్రజలందరికీ అందించడం. ఇస్లాంను దాని నిజరూపంలో ప్రదర్శించి, ప్రజలలో దివ్యఖుర్ఆన్ మరియు ఇస్లాం పట్ల ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించటానికి ప్రయత్నించడం. దీని కొరకు మేము దివ్యఖుర్ఆన్ ను తెలుగు మరియు ఇతర భాషలలో, ప్రింట్, ఆడియో, విడియో మరియు ఇతర మీడియాల ద్వారా అందజేయటానికి - భౌతికంగా మరియు ఆర్థికంగా మాకు సాధ్యమైనంతవరకు - ప్రయత్నిస్తున్నాము.
 • దీని మరొక ఉద్దేశం సహీ హదీసులను (మహాప్రవక్త ’స.అ.స. ప్రవచనాలను) కూడా తెలుగు మరియు ఇతర భాషలలో, ప్రింట్, ఆడియో, విడియో మరియు ఇతర మీడియాల ద్వారా మాకు - భౌతికంగా మరియు ఆర్థికంగా సాధ్యమైనంతవరకు - అందజేయటం.
 • మేము అరబ్బీ-తెలుగు నిఘంటువును తయారు చేయడం ప్రారంభించాము. ఇంతవరకు ఇలాంటి నిఘంటువు మార్కెట్ లో లేదు.
 • మేము అరబ్బీ వ్యాకరణాన్ని, తెలుగు భాషలో వ్రాస్తున్నాము.
 • మేము దివ్యఖుర్ఆన్ మరియు సహీహదీసులను (మహాప్రవక్త ’స.అ.స. ప్రవచనాలను) మాకు సాధ్యమైనంతవరకు ఆంధ్రప్రదేశపు దూరదూర ప్రాంతాలలో ఉన్న చిన్నచిన్న గ్రామాలకు అందజేస్తున్నాము. మాకు దాదాపు 78,000 గ్రామాలు మరియు 80,000,000 (ఎనివిది కోట్ల) ప్రజలకు దివ్యఖుర్ఆన్ గ్రంథాన్ని, అందజేయవలసి ఉన్నది. ఇంతవరకు మేము 30,000 (ముఫ్ఫైవేలు), డా. అబ్దుల్ రహీమ్ మౌలానా అనువదించిన, “దివ్యఖుర్ఆన్ సందేశం” గ్రంథమును ప్రజలలో పంచాము. ప్రతి గ్రామానికి ఒక దివ్యఖుర్ఆన్ ఇవ్వాలన్నా, కనీసం 100,000 (ఒక లక్ష) గ్రంథాలు కావాలి.
 • మేము 1. “దివ్యఖుర్ఆన్ సందేశం” గ్రంథాన్ని, 2. “దివ్యఖుర్ఆన్ సందేశం” MP3 - CD తెలుగులో, 3. “దివ్యఖుర్ఆన్ సందేశం” MP3 - DVD అరబ్బీ-తెలుగులో, 4. “దివ్యఖుర్ఆన్ సందేశం” అరబ్బీ-తెలుగు, ఆడియో-విడియో CD కంప్యూటర్ల కొరకు, మరియు 5. “దివ్యఖుర్ఆన్ సందేశం” అరబ్బీ-తెలుగు, ఆడియో-విడియో DVD ఇండ్లలో నడిచే వ్యూ C.D. ప్లేయర్ల కొరకు, వీలైనంతవరకు ఉచితంగా పంచుతున్నాము.
 • మేము ప్రస్తుతం10(పది) చిన్న, చిన్న గ్రామాలలో ఖుర్ఆన్-అరబ్బీ మరియు అహాదీసులు నేర్పే పార్ట్-టైమ్ పాఠశాలలను నడుపుతున్నాము. ఇది ప్రజలలోని నిరక్షరాస్యతను దూరం చేసి వారిని మంచి పౌర్వికులుగా చేయటానికి సహాయపడగలదు. మాకు ఆర్థికసహాయం దొరికితే, మేము ఇంకా ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి పాఠశాలలను ఏర్పాటుచేయగలము.
 • ఈ పుణ్య కార్యాలలో మీరు పాల్గొంటారని ఆశిస్తున్నాము.

ఒక్క “దివ్యఖుర్ఆన్ సందేశం” గ్రంథం , కేవలం 200 రూపాయల (US $ 5/-)కు మాత్రమే.


SHANTHI KIRANALU  (AL-FALAQ) Community Welfare Trust ®, H.No. 2-6-7/MAK/A/506, Upperpally, Rajendernagar,  Hyderabad- 500048, T.S.
Ph: +91-9652468568,+91-9490793467, Saudi Arabia: +966 503529194,+966 555545718   Email: telquran@gmail.com, info@telugu-quran.com